తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ప్రభుత్వ విప్‌ల నియామకం

  • అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించిన ప్రభుత్వం
  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
  • అసెంబ్లీ విప్‌లుగా ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశం, విజయరమణారావు
తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను రాష్ట్ర ప్రభుత్వం విప్‌లుగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఇక, అసెంబ్లీ విప్‌లుగా ముగ్గురు ఎమ్మెల్యేలను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విప్‌లుగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు.

Addanki Dayakar
Telangana MLC
Congress Party
Balmoori Venkat
Telangana Government
Government Whip

More Telugu News